ఒలింపిక్స్‌ పతకాల వేటలో భారత్‌

July 28, 2021
img

టోక్యో ఒలంపిక్స్ లో బుధవారం ఇండియాకు బాక్సింగ్, బాడ్మింటన్, ఆర్చర్ క్రీడా అంశాల  క్రీడాకారులు రాణించడంతో పతకాలపై ఆశలు మరింత పెరిగాయి.  

బాక్సింగ్: మహిళా యువ కెరటం బాక్సర్ పూజారాణి (79 కిలోలు) అల్జీరియాకు  చెందిన ఇచ్చార్క్ చెయ్ బోన్స్ ను 5-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో గెలిస్తే పతకం తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బ్యాడ్మింటన్: తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు తీవ్రంగా శ్రమించి ముందుకు వెళ్ళింది.   గ్రూప్-జెలో జరిగిన రెండో పోటీలో సింధు హంకాంగ్‌కు చెందిన చెంగ్ అంగంయిని 2-0 తేడాతో ఓడించింది. దీంతో సింధు తదుపరి పోటీలో పతకం సాధించే అవకాశాలు పెరిగాయి. 

ఆర్చరీ (విల్లువిద్య పోటీలు): మహిళా ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత విల్లువిద్య పోటీలలో క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. దీపిక కుమారి అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఫెర్నాండోజ్‌పై 6-4 తేడాతో గెలిచింది.

Related Post