శ్రీలంక జట్టుపై భారత్‌ తొలి విజయం

July 19, 2021
img

ఇండియా జూనియర్ క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇండియా-శ్రీలంక జట్ల మద్య మూడు వన్డేలు, టి-20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం రెండు దేశాల మధ్య మొదటి వన్డే మ్యాచ్ కొలంబోలోని సోనీ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 262 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. ఇండియా బౌలర్లలో దీపక్ చాహర్, చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో రెండేసి వికెట్లు పడ్డాయి. ఇండియా 263 పరుగుల లక్ష్యాన్ని 36.3 ఓవర్లలోనే సులువుగా ఛేదించి విజయాన్ని సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 86, ఇషాన్ కిషన్ 59, పృథ్వీ షా 43 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. పృథ్వీ షాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే రేపు జరగనుంది. ఇండియా సీనియర్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఆదేశంతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

Related Post