భారత్‌-పాక్‌ జట్ల మద్య టి-20

July 17, 2021
img

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్తను అందించింది. రెండు దేశాల మధ్య క్రికెట్ అంటేనే ఆ ఉత్సాహం, ఉత్కంఠత వేరేగా ఉంది. అయితే గడిచిన కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో రాజకీయ, సాంస్కృతిక, క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య జరగాల్సిన కొన్ని సిరీస్‌లు రద్దయ్యాయి. కానీ ఐసీసీ నిర్వహించే సిరీస్‌లో మాత్రం రెండు దేశాలు తలపడతాయి. 

ప్రపంచ టీ-20 కప్ తొలి రౌండ్, సూపర్-12 గ్రూప్‌ల వివరాలను ఐసీసీ వెల్లడించింది. దీని ప్రకారం ఓకే గ్రూపులో ఇండియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఐసీసీ  టీ-20 ప్రపంచ కప్ మొదట ఇండియాలో నిర్వహించాలనుకున్నప్పటికీ ఆ సమయంలో థర్డ్ వేవ్ మొదలవవచ్చనే ఊహాగానాలు నేపథ్యంలో యూఏఈ, ఓమెన్ దేశాలలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. 

ఐసీసీ ప్రపంచ టీ-20 కప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14న వరకు జరుగనుంది. ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది గొప్ప ఉత్సాహనిచ్చే వార్తేనని చెప్పవచ్చు. ఐసీసీ  జట్టుల విజయాలు, ఓటములను బేరీజు వేసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో  ఐసీసీ తొలి రౌండ్, సూపర్-12 గ్రూప్‌ల వివరాలను వెల్లడించింది. వీటి ప్రకారం... 

గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్, నమీబియా,

గ్రూప్-బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమెన్ ఉన్నాయి. 

వీటిలో గెలిచి రన్నరప్‌గా నిలిచిన జట్లు సూపర్-12లో చోటు దక్కుతుంది.

సూపర్-12 దశలో ఇదివరకే అర్హత సాధించిన జట్లు ఉన్నాయి. 

గ్రూప్-1: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్,

గ్రూప్-2: ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.

Related Post