వర్షం కారణంగా మొదటిరోజు మ్యాచ్ రద్దు

June 19, 2021
img

ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ మొదటి రోజు ఆట వర్షార్పణం అయింది. లండన్ సౌతాంప్టన్ రోజ్ బోల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్  జట్ల మధ్య నిన్న జరగాల్సిన తొలి రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. అక్కడ ఉదయం నుండి వర్షం కురుస్తూనే ఉంది. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ గ్రౌండ్ అంతా నీటితో నిండిపోయింది. దీంతో ఫీల్డ్ ఎంపైర్లు మొదటిరోజు ఆటను నిలిపివేశారు. అక్కడి వాతావరణ సంస్థ రానున్న ఆరు రోజులు వర్షాలు పడనునట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా మ్యాచ్ జరిగేది లేనిది అనుమానమే.


Related Post