ప్రపంచ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఛాంపియన్‌షిప్‌కి భారత జట్టు రెడీ

June 16, 2021
img

ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఇంగ్లాండ్‌లో ప్రపంచ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఛాంపియన్‌షిప్ జరుగబోతోంది. శుక్రవారం సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇండియా జట్టు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన విజేతకు రూ.11.67 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.5.84 కోట్లు లభిస్తుంది. ఇండియా ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్‌షిప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇండియా, న్యూజిలాండ్ రెండు జట్లు తమ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.

ఇండియా జట్టు అంచనా : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహో, జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్, షమీ, ఉమేష్ యాదవ్, రిషబ్ పంత్, శుబుమన్ గిల్.

న్యూజిలాండ్ జట్టు అంచనా : కేన్ విలియమ్సన్, టామ్ బ్లన్డెల్, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్, కోలిన్ డి గ్రాండ్హోమ్, టామ్ లీ తమ్, హేనరీ  నికోలస్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, రాస్ టైలర్, విల్ యంగ్.

Related Post