ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు భారత్‌ జట్టు ఖరారు

May 08, 2021
img

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ కప్ పోటీకి భారత జట్టు ఖరారైంది. శుక్రవారం బీసీసీఐ జట్టు సభ్యులను ప్రకటించింది. 

జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహో, ఆర్ అశ్విన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, శుబుమన్ గిల్

భారత్ జట్టు మొదట న్యూజిలాండ్‌ జట్టుతో ఆడుతుంది. వచ్చే నెల 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లో ఈ టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు జట్లూ ఐసీసీ టెస్టు ర్యాంకిం గ్‌లో మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లు పూర్తయిన భారత్‌ వెంటనే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.


Related Post