సన్‌ రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు

May 03, 2021
img

ఐపీఎల్ సీజన్ 14లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జెట్లి స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్  మధ్య మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ టాస్ గెలిచి ఆర్ఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ 123, సంజూ శాంసన్ 48 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. ఆర్ఆర్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ తడబడుతూ ఆడటం ప్రారంభించింది. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ అందరూ పెద్దగా పరుగులు చేయకుండానే అవుటయ్యారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ చివరి స్థానానికి చేరింది. మే 7న సన్ రైజర్స్ తర్వాత మ్యాచ్  చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగనుంది.


Related Post