సన్‌ రైజర్స్‌ ఖాతాలో మరో ఓటమి

April 29, 2021
img

గత రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి  171 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో మనీష్ పాండే 61, డేవిడ్ వార్నర్ 57, కేన్ విలియం సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. సన్ రైజర్స్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే ధాటిగా ప్రారంభించి చివరి వరకు అదే ధాటిని కొనసాగించి ఘన విజయం సాధించింది. సీఎస్‌కే 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 70, డూ ప్లేస్ 56 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు.

ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్‌ ప్లే అఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. సన్ రైజర్స్ తదుపరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో మే 2న జరుగనుంది. 


Related Post