ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌ రైజర్స్‌ పరాజయం

April 26, 2021
img

సన్ రైజర్స్ హైదరాబాద్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం రాత్రి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సన్ రైజర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) మద్య జరిగిన మ్యాచ్‌లో డిసి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డిసి నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. డిసి బ్యాటింగ్‌లో పృథ్వీ షా 53, రిషబ్ పంత్ 37 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. డిసి ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌ రైజర్స్‌పై చాలా సులువుగా చేదించి విజయం సాధిస్తుందని అభిమానులు భావించారు. కానీ డిసి అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ ప్రదర్శనలు కనపరచి సన్‌ రైజర్స్‌పై విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో కేన్ విలియమ్సన్ 66, జానీ బెయిర్స్టో 38 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. ఇంకొక పరుగు చేసేది ఉంటే సన్ రైజర్స్ దే విజయం అయ్యేది. రెండు టీములు స్కోరు సమానం అవ్వడంతో ఫీల్డ్ ఎంపైర్‌లు సూపర్ ఓవర్ ఛాన్స్ ఇచ్చారు. 

సూపర్ ఓవర్‌లో ఆరు బంతులలో  సన్‌ రైజర్స్‌ 7 పరుగులు చేయగా డీసీ ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించి  విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పరాజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి. ఈనెల 28న సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

Related Post