ఐపీఎల్ సీజన్ 14లో సన్‌ రైజర్స్‌ తొలి విజయం

April 21, 2021
img

ఐపీఎల్ సీజన్ 14లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ మొదటి విజయాన్ని చవిచూసింది. బుధవారం చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌ రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్‌ను తక్కువ పరుగులు చేసేలా కట్టడి చేశారు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో షారుక్ ఖాన్, మయూక్ అగర్వాల్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. సన్ రైజర్స్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్‌కు 3, అభిషేక్ వర్మకు 2 వికెట్లు పడ్డాయి. 

తరువాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌ రైజర్స్‌ జట్టు పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 121 పరుగుల లక్ష్యాన్ని ధాటిగా ప్రారంభించి అదే దాటిని చివరి వరకు కొనసాగించి ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 121 పరుగులు చేసింది. సన్‌ రైజర్స్‌ బ్యాటింగ్‌లో జానీ బెయిర్స్టో 63, డేవిడ్ వార్నర్ 37 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 5వ స్థానానికి ఎగబాకింది. ఈనెల 25న సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. రాబోయే అన్ని మ్యాచ్ లను సన్ రైజర్స్ గెలిస్తేనే రన్ రేట్ పెరిగి ప్లేఆఫ్‌లో అవకాశాలు ఉంటాయి.

Related Post