ఐపీఎల్ షురూ... బోణీ కొట్టిన ఆర్‌సీబీ

April 10, 2021
img

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రేక్షకులు లేకుండానే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మొదలయ్యాయి. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 అంతకుముందు ఆర్‌సీబీ టాస్ గెలిచి ఎంఐని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 159 పరుగులు చేసింది. ఎంఐ బ్యాటింగ్‌లో యాన్ 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నారు. ఎంఐ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కు 5 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఆర్‌సీబీ బ్యాటింగ్‌కు వచ్చింది. ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసి ఎంఐఫై ఘన విజయం సాధించింది. ఈక్రమంలో ఆర్‌సీబీ 8 వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చక్కని పోరాటపటిమ కనబరిచాయి కానీ అంతిమ విజయం మాత్రం ఆర్‌సీబీదే అయ్యింది. చివరి బంతి వరకు చాలా మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో ఎబి డివిలియర్స్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హర్షల్ పటేల్(ఆర్‌సీబీ)కి దక్కింది. 

 ఈరోజు ఐపీఎల్ రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది.

Related Post