వన్డే కూడా ఇండియాదే!

March 29, 2021
img

ఆదివారం పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

 అంతకుముందు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు  ఆహ్వానించింది.  ఇండియా జట్టు 48.2 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్ 78, హార్థిక్ పాండ్యా 64, శిఖర్ ధావన్ 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నారు. కెప్టెన్ కోహ్లి పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, ఆదిల్ రషీద్‌లకు చెరో 2 వికెట్లు పడ్డాయి. మిగతా బౌలర్లకు ఒక్కొక్క వికెట్‌ పడ్డాయి.

ఇండియా ఇచ్చిన భారీ పరుగుల  లక్ష్యాన్ని చేదించి గెలిచేందుకు ఇంగ్లాండ్ చివరి బాల్ వరకు గట్టిగా ప్రయత్నించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ చక్కటి బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి కనబరిచారు. ఒకానొక దశలో ఇంగ్లాండ్‌దే విజయం అన్న స్థాయిలో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వందల ఇరవై రెండు పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో శ్యామ్ కరణ్ 95, డేవిడ్ మలన్ 50 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. ఇండియా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ 4, భువనేశ్వర్ కుమార్ 3, టీ నటరాజన్‌కు ఒక వికెట్‌ పడ్డాయి.

 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడు వన్డే సిరీస్‌లో ఇండియా రెండు మ్యాచ్‌లు గెలవడంతో ఈ వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకొంది.  

దీంతో ఇండియా-ఇంగ్లాండ్ మద్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను, ఆ తర్వాత టి20 సిరీస్‌ను, తాజాగా వన్డే సిరీస్‌ను కూడా గెలిచి  రికార్డులోకెక్కింది.

 ఇండియా:329/10

 ఇంగ్లాండ్ :322/9

Related Post