రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఘన విజయం

March 27, 2021
img

పుణే, ఎంసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ వన్డేలో ఇండియాపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. అంతకు ముందు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. ఇండియా బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ 108,  రిషబ్ పంత్77, విరాట్ కోహ్లీ 66, హార్దిక్ పాండ్యా 35 పరుగులు తీసి టాప్‌ స్కోరర్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టాప్ల్య్ 2, టామ్ కరణ్ 2,సామ్ కరణ్,  ఆదిల్ రషీద్‌లకు ఒక వికెట్‌ పడ్డాయి. 

ఇండియా ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు కనబరిచి విజయానికి బాటలు వేశారు. ఇంగ్లాండ్ 336 పరుగుల లక్ష్యాన్ని 43.3 ఓవర్లలోనే పూర్తి చేసి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జానీ బెయిర్స్టో 124, బెన్ స్టోక్స్ 99, జాసన్ రాయ్ 55 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నారు. ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2,  భువనేశ్వర్ కుమార్‌లకు ఒక వికెట్‌ పడ్డాయి. మిగతా ఒక బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యారు.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో వన్డే క్రికెట్ సిరీస్‌లో  ఇండియా 1 మ్యాచ్ గెలిస్తే, ఇంగ్లాండ్ మరొకటి గెలిచి రెండు జట్లు సమానంగా ఉన్నాయి. కనుక ఆదివారం జరుగబోయే మూడో వన్డే మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం కానుంది. 

ఇండియా:336/6

ఇంగ్లాండ్ :337/4

Related Post