మొదటి వన్డేలో ఇండియా ఘన విజయం

March 24, 2021
img

పూణే ఎంసీఏ స్టేడియంలో మంగళవారం మొదటి వన్డేలో ఇంగ్లాండ్‌ జట్టుపై ఇండియా ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాణించి ఐదు వికెట్లకు 50 ఓవర్లలో  317 పరుగులు చేసారు. శిఖర్ ధావన్ 98, కేఎల్ రాహుల్ 62, కృనాల్ పాండ్య 58, విరాట్ కోహ్లీ 56 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3, మార్క్ వు డ్‌కు చెరో 2 వికెట్లు పడ్డాయి.

ఇండియా ఇచ్చిన 317 రన్స్ టార్గెట్‌ను చేధించడంలో ఇంగ్లాండ్ విఫలమై ఓడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు 42.1 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో  జానీ బేర్స్టో 94, జాసన్ రాయ్ 46, మోయిన్ అలీ 30 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. మిగతా  బ్యాట్స్ మెన్ అందరూ తక్కువ పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో  ప్రసిద్ధ కృష్ణ  4, శార్దూల్ ఠాగూర్ 3,  భువనేశ్వర్ కుమార్ 1,  కృనాల్ పాండ్య 1 వికెట్లు తీశారు.  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు శిఖర్ ధావన్‌కు దక్కింది.

దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడు వన్డే సిరీస్ మ్యాచ్‌లో ప్రస్తుతం ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ ఈనెల 26 తేదీన జరుగనుంది.

ఇండియా:317/5

ఇంగ్లాండ్ :251/10

Related Post