నేటి నుండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్

March 04, 2021
img

నేటి నుండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ లో ని మోతేరా స్టేడియం లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం అవుతుంది.

ఇండియా మూడో టెస్ట్ మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో గెలిచిన ఆనందంతో బరిలోకి దిగనున్నారు. మూడో టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు జరగనుండగా రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇండియ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలింది. రెండు జట్లు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బరిలోకి దిగనున్నాయి. ఇంగ్లాండ్ ఓటమిని దిగమింగుకొని మరింత కసిగా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ చివరి టెస్ట్ మ్యాచ్ డ్రా గా  ముగిస్తే టెస్ట్ మ్యాచ్ సిరీస్ మనదే అవుతుంది.  రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి. చివరి టెస్ట్ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది.

భారత్ జట్టు: విరాట్ కోహ్లీ,  రిషబ్ పంత్, రోహిత్ శర్మ, గిల్, చటేశ్వర్ పుజారా, రహనా, అశ్విన్, అక్షర్ పటేల్,  వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మయూఖ్ అగర్వాల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా. 

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్, బెన్ ఫోక్స్, క్రాలెయ్, భరిస్టో, స్టోక్స్, పొప్, బిస్, లీచ్, ఆర్చర్, అండర్సన్, బ్రాడ్, బర్న్స్, స్టోన్

మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు జట్టులో సల్ప మార్పులు ఉండవచ్చు.

Related Post