మోతేరాలో నేటి నుంచి మూడో టెస్ట్ మ్యాచ్‌

February 24, 2021
img

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ (మోతేరా) స్టేడియంలో మధ్యాహ్నం 2:30  గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియం స్టేడియంను రాష్ట్రపతి రాంనాథ్  కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించిన తరువాత మ్యాచ్ వీక్షించనున్నారు. ఈ మ్యాచ్‌ డే అండ్  నైట్‌ జరగనుంది.

ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్, ఇంగ్లాండ్ జట్టులు చెరో టెస్ట్ మ్యాచ్‌ గెలుచుకొని సిరీస్ సమానం చేశాయి. కనుక ఈరోజు నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమైనది.

భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్‌  గెలుపొంది మంచి ఊపుమీద ఉండగా, ఇంగ్లాండ్ జట్టు ఓటమిని నుండి బయటపడి ఈసారి భారత్‌ జట్టును ఓడించితీరాలని పట్టుదలగా ఉంది.  

పిచ్: మరికొన్ని గంటలలో మోతేరా స్టేడియం ప్రారంభమయ్యే మొదటి సెషన్‌లో పిచ్ మీడియం పేసర్  బౌలర్లకు అనుకూలించే విధంగా ఉంది. క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలించే విదంగా పిచ్ మారుతుందని క్యూరేటర్ తెలిపారు. మోతేరా పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్ చెపుతున్నందున ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలని ప్రయత్నించవచ్చు. 

భారత జట్టు వివరాలు.:

అజింఖ్య రహానే, చటశ్వర్ పూజరా, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.

ఇంగ్లాండ్ జట్టు వివరాలు:

డాన్ లారెన్స్, డోమ్ సిబ్లీ, జోసెఫ్ బర్న్స్, బెన్ స్టోక్స్, ఒళ్లి పొప్, క్రిస్ వక్స్, బరిస్టో, స్టూర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, జోర్ఫా ఆర్చర్.

మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ఇరుజట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Related Post