మోతేరాలో రేపు భారత్‌-ఇంగ్లాండ్ 3వ టెస్ట్ మ్యాచ్‌

February 22, 2021
img

రేపటి నుండి భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు  జరుగనుండగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఒకటి భారత్ గెలిస్తే, మరొకటి ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్ సమానమైంది. కనుక రేపటి నుండి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం కానుంది. 

భారత్‌లో అతిపెద్ద స్టేడియంలలో మోతేరా స్టేడియం కూడా ఒకటి. మోతేరా స్టేడియంలో జరుగబోయే మొట్ట మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మొదటి టెస్ట్ మ్యాచే డే అండ్ నైట్‌గా జరగనుంది. తమిళనాడులోని చెపాక్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ మీడియం పేసర్లు అనుకూలిస్తే, రెండో టెస్ట్ మ్యాచ్ భారత స్పిన్నర్లకు అనుకూలించింది. మొట్టమొదటిసారిగా ఇరు జట్లు మోతేరా స్టేడియంలో రేపు ఆడబోతుండటంతో పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుందా లేక మీడియం పేసర్‌లకు అనుకులిస్తుందా అని ఇరుజట్లు ఎదురుచూస్తున్నాయి. రేపు మోతేరా స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రేపటి డే అండ్ నైట్ మ్యాచ్‌లో పింక్ కలర్ బాల్‌తో ఆడుతారు.

Related Post