సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై దానం నాగేందర్ ఆగ్రహం

February 22, 2021
img

ఖైరతాబాద్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ 14 మినీ వేలంపాటలో స్థానిక క్రీడాకారులను తీసుకోకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్‌లో క్రీడాకారులకు కొదవలేకపోయినా జట్టులో ఒక్కరు కూడా స్థానికులను తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయని అలాంటి వ్యక్తిని కెప్టెన్‌గా ఎలా కొనసాగిస్తారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్థానిక క్రీడాకారులకు అవకాశం ఇవ్వకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. భారత్‌ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానికులను తీసుకోకపోవడంపై ఆ ఫ్రాంచైజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేసిన సంగతి తెలిసిందే.


Related Post