ఐదు వికెట్లకు 274 పరుగులు చేసిన ఆస్ట్రేలియా

January 15, 2021
img

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఈరోజు గబ్బా స్టేడియంలో ప్రారంభమైంది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ ఒక పరుగు చేసి సిరాజ్ వేసిన బంతితో క్యాచ్ అవుట్ అయ్యారు. కాసేపటికే మార్క్  హరిస్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ సహకారంతో లూబు చేంజ్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ కాసేపటికే స్టీవ్ స్మిత్ 35 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగులో అవుటయ్యాడు. తరువాత మాథ్యూ  వేడ్ బ్యాటింగుకు వచ్చారు. లుబు చేంజ్ 106 పరుగుల చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుటయ్యారు. మరికాసేపటికే  మాథ్యూ వెడు 42 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 274 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కామెరా గ్రీన్ 28 పరుగులతోను, టీం షైన్ 38 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో నటరాజన్‌కు 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు తలో ఒక వికెట్లు పడ్డాయి.

Related Post