ప్రేక్షకులు... ఛీర్ గర్ల్స్ లేకుండా నేటి నుంచే ఐపీఎల్...

September 19, 2020
img

ఒకప్పుడు రోజుల తరబడి సాగే టెస్ట్ క్రికెట్ చూసి చూసి విసుగెత్తిపోయిన క్రికెట్ అభిమానులకు 20/20 వన్డే మ్యాచ్‌లు ఉర్రూతలూగించాయి. వాటికి కావలసినంత వినోదం జోడించి, ఒక్కో టీమ్‌లో దేశవిదేశాలకు చెందిన ఆటగాళ్ళను పెట్టి రూపొందించిన ఐపీఎల్ మ్యాచ్‌లను చూసి క్రికెట్ అభిమానులు వెర్రెక్కిపోతుంటారు. అటువంటి ‘క్రేజీ క్రికెట్ షో’ నేటి నుంచి అబుదాబిలోని షేక్ జయిద్ స్టేడియంలో మొదలవబోతోంది. నేటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐపిఎల్ 13వ ఎడిషన్‌లో నవంబర్‌ 10వరకు 53 రోజులపాటు ఏకధాటిగా కొనసాగుతాయి. వాటిలో పాల్గొనే 8 టీములు మొత్తం 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి. యూఏఈలో దుబాయ్ ఇంటెర్నేషనల్ స్టేడియంలో 24 మ్యాచ్‌లు, అబుదాబిలోని షేక్ జైద్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

అయితే కరోనా నేపధ్యంలో ఈసారి ఎటువంటి ప్రారంభోత్సవం చేయకుండా, స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా జరపాలని వీటికి ఆతిధ్యమ్ ఇస్తున్న యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఐపిఎల్ మ్యాచ్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘చీర్ గర్ల్స్’ హడావుడి కూడా ఈసారి ఉండబోదు. 

ఇవాళ్ళ అబుదాబిలో భారతీయ కాలమానప్రకారం రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మద్య తొలి మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఐపిఎల్ మ్యాచ్‌ పూర్తి షెడ్యూల్ : 




Related Post