టి20 ప్రపంచ కప్ పోటీలు వాయిదా?

May 27, 2020
img

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగవలసిన టి20 ప్రపంచ కప్ పోటీలను కరోనా నేపధ్యంలో 2022కు వాయిదా వేయబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) గురువారం దీనిపై భాగస్వామ్య దేశాల క్రికెట్ బోర్డులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించబోతోంది. కనుక దీనిపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ సభ్యదేశాల క్రికెట్ బోర్డులు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే, టి20 ప్రపంచకప్‌కు బదులు ఐపీఎల్ టోర్నీనిర్వహించాలనే కొత్త ప్రతిపాదనపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఏడాది చివరిలోగా కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రపంచదేశాలు కరోనా బారి నుంచి పూర్తిగా బయటపడటానికి మరొక ఆరేడు నెలలు పట్టవచ్చు. కనుక స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఆడేందుకు సిద్దపడితే తప్ప మరో 12 నెలల వరకు ఐపీఎల్ టోర్నీనిర్వహించడం కూడా కష్టమే. 


Related Post