నెట్‌ఫ్లిక్స్‌లోకి రానా నాయుడు-2 వెబ్ సిరీస్‌

May 20, 2025
img

విక్టరీ వెంకటేష్‌, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్‌ ‘రానా నాయుడు’ సూపర్ హిట్ అవడంతో దానికి కొనసాగింపుగా రానా నాయుడు సీజన్ 2 సిద్దం చేశారు. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్‌ ప్రసారం కాబోతోంది. 

తెలుగు సినీ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌, దగ్గుబాటి రానా ఇద్దరూ ఎంతో గౌరవం పొందుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వారి కుటుంబాలకు పేరు ప్రతిష్టలున్నాయి. అటువంటి ఉన్నత స్థాయి నటులు ఇటువంటి అసభ్యమైన, మితిమీరిన శృంగార సన్నివేశాలు, చవుకబారుగా బూతులు మాట్లాడుతూ ఇటువంటి వెబ్ సిరీస్‌లో నటించడం తెలుగు ప్రజలు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అందుకు వారిరువురూ తీవ్ర విమర్శలపాలయ్యారు కూడా. 

కానీ ఈ ‘ఓవర్ డోస్ అశ్లీలత’ కారణంగానే చాలా మంది.. ముఖ్యంగా యువత రానా నాయుడు వెబ్ సిరీస్‌కు బ్రహ్మ రధం పట్టారు. కనుకనే వెంకటేష్, రానా సీజన్-2 చేసేందుకు సాహసించారని చెప్పవచ్చు.

Related Post