మహేష్ బాపు దర్శకత్వంలో ‘రాపో22’ వర్కింగ్ టైటిల్‌తో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటిస్తున్న సినిమాకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఖరారు చేసి టైటిల్ గ్లింమ్స్ నేడు విడుదల చేశారు.
ఇది ఓ అభిమాని బయోపిక్ అంటూ నిన్ననే సినిమా కధ గురించి చిన్న క్లూ ఇచ్చారు. నేడు విడుదల చేసిన టైటిల్ గ్లింమ్స్‌లో అదే చూపారు. ఈ సినిమాలో 1970-80 మద్య సినీ హీరోల అభిమానులు ఏవిదంగా ఉండేవారో తెలియజేయబోతున్నట్లు టైటిల్ గ్లింమ్స్‌లో చూపారు.
ఇటువంటి పీరియాడికల్ మూవీలు చాలానే వస్తున్నాయి కనుక వాటిలో ఇది కూడా ఒకటని అనుకోవచ్చు.
కానీ ఆంధ్రా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అని టైటిల్ పెట్టడం, మళ్ళీ ‘ఆంధ్రా కింగ్’ పాత్రలో కర్ణాటకకు చెందిన ఉపేంద్రని పెట్టడం వలన ఈ సినిమా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రజలు కనెక్ట్ కాకపోతే నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
అయినప్పటికీ ఈ కధతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మెప్పించగలిగితే చాలా గొప్ప విషయమే అవుతుంది.
ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే, ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.