విశ్వంభర రామరామ తన్మయత్వం

April 12, 2025
img

మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేస్తున్న ‘విశ్వంభర’ నుంచి ‘రామరామ.. ' అంటూ సాగే తొలిపాటని విడుదలైంది. సరస్వతీ పుత్ర అని బిరుదు తగిలించుకొని తెలుగు భాషని ఖూనీ చేస్తూ చిత్ర విచిత్రమైన పాటలు వ్రాస్తున్న రామజోగయ్య శాస్త్రి మనసుపెడితే ఎంత చక్కగా పాటలు వ్రాయగలరో తెలుసుకునేందుకు ఈ పాట ఓ చక్కటి ఉదాహరణం. ఆ పాటకి ఎంఎం కీరవాణి అద్భుతంగా స్వరపరిచి చక్కటి సంగీతం అందించారు. శంకర్ మహదేవన్, లిపిసిక కలిసి మరింత మధురంగా ఈ పాటని ఆలపించారు. 

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే భారీ సెట్టింగ్స్, భారీ గ్రూప్ డాన్స్ తప్పనిసరనే ఆనవాయితీ ఏర్పడినందున అందుకు తగ్గట్లుగానే సెట్ వేసి తీశారు. పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 

ఈ సినిమాలో ఆషిక రంగనాధ్, కునాల కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.    

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. విశ్వంభర జూలై 24న విడుదల కాబోతోంది.

Related Post