ప్రముఖ నిర్మాత నాగ వంశీ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్ అవడంతో నేడు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు, ఆ సినిమా రివ్యూలపై స్పందిస్తూ, “మీకు (మీడియా) దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి. నా సినిమాల గురించి వ్రాయడం మానుకోండి. నా దగ్గర సినిమా ప్రకటనలు తీసుకోకండి.. నా సినిమాలు రివ్యూలు వ్రాయకండి.. నా సినిమాని నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో లాజిక్ చూడొద్దు రెండున్నర గంటలసేపు హాయిగా నవ్వుకోవడానికే సినిమా చూడామని ముందే చెప్పాను కదా? అయినా ఆ సినిమాలో ఇది బాగోలేదు అది బాగోలేదంటూ రివ్యూలు వ్రాయడం దేనికి?మీరు వ్రాసే రివ్యూలు చూసే జనం సినిమాలు చూస్తారనుకుంటే పొరపాటు. ప్రేక్షకులకు సినిమా నచ్చితే వారిని ఏ రివ్యూలు ఆపలేవు.
నా సినిమా బాగుందని ప్రేక్షకులు చూస్తున్నప్పుడు, మద్యలో మీడియాకు ఎందుకు బాధ? చక్కగా ఆడుతున్న సినిమాని దెబ్బ తీయాలని ఎందుకనుకుంటున్నారు?” అంటూ నిర్మాత నాగ వంశీ నిప్పులు చెరిగారు.