రామ్ చరణ్‌ సినిమా టైటిల్‌ పెద్ది.. ఫస్ట్-లుక్‌ అవుట్

March 27, 2025
img

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న సినిమాకి ఊహించిన్నట్లే పెద్ది టైటిల్‌ ఖరారు చేశారు. రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ది ఫస్ట్-లుక్‌ పోస్టర్ విడుదల చేశారు. 

గుబురుగా పెరిగిన జుట్టు, గడ్డం.. బీడీ కాలుస్తున్న పోస్టర్లో రామ్ చరణ్‌ని గుర్తుపట్టడం కూడా కష్టం. రెండో పోస్టర్లో చూస్తేనే ‘అవును ఇతను రామ్ చరణే’ అని నమ్మగలుగుతాము. మొదటి పోస్టర్లో అంత రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించారు. దానిలో రామ్ చరణ్‌ వెనుక కర్రలు, కాషాయ జండాలు పట్టుకున్నవారిని చూపారు. 

రెండో పోస్టర్లో చేతిలో బ్యాట్ పట్టుకొని ఉండగా దూరంగా లైట్ల వెళుతురులో నైట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంని చూపారు. ఇప్పుడు రెండు పోస్టర్స్ కలిపి చూసినట్లయితే క్రికెట్ ఆట నేపద్యంతో సాగే ఈ సినిమాలో మత రాజకీయాలతో కనెక్ట్ చేసిననట్లనిపిస్తుంది. లేదా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్ నేపధ్యంలో సాగే కధ అయ్యుండవచ్చు. ఒకవేళ ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్ కధాంశంతోనే పాన్ ఇండియా మూవీగా తీస్తున్నట్లయితే యావత్ దేశ ప్రజలు ఈ సినిమాతో తప్పకుండా కనెక్ట్ అవుతారు. నచ్చితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది.  

ఈ సినిమాలో జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు. 

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.       

Related Post