పుష్ప-2 రెండువారాల్లో 1508 కోట్లు కలెక్షన్స్‌!

December 20, 2024
img

పుష్ప-2 సినిమాలో పుష్పరాజ్ అడవులలో నుంచి ఎర్ర చందనం దుంగలు దోచుకోగా, బయట ప్రపంచంలో పుష్ప-2 ప్రేక్షకులను దోచేసుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1508 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ సాధించడమే ఇందుకు నిదర్శనం.

కేవలం 14 రోజులలోనే ఈ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా పుష్ప-2 సరికొత్త రికార్డు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిన పుష్పరాజ్ జోరు ఎలాగూ కొనసాగుతోంది. ఉత్తరాదిన హిందీ రాష్ట్రాలలో కూడా పుష్పరాజ్ ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ఉత్తరాది రాష్ట్రాలలో కేవలం 13 రోజులలో అత్యంత వేగంగా రూ.601.50 కోట్లు కలెక్షన్స్‌ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 

ఓ కమర్షియల్ సినిమాకి ఈ స్థాయిలో ప్రేక్షకాధరణ లభించడం, ఈ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించడం మామూలు విషయం కాదు. కమర్షియల్ సినిమాతో కూడా ఏవిదంగా రికార్డులు సృష్టించవచ్చో అల్లు అర్జున్‌, సుకుమార్ నిరూపించి చూపారు. కనుక ఇప్పుడు దేశంలో అన్ని సినీ పరిశ్రమలు ఈ ఫార్ములాని అర్దం చేసుకొని ఫాలో అయిపోతే చాలు... భారతీయ సినిమా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోగలదు. 

Related Post