గేమ్ ఛేంజర్‌ టీజర్‌… నిజంగానే అన్ ప్రెడిక్టబుల్!

November 10, 2024
img

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్‌ టీజర్‌ విడుదలైంది. టీజర్‌ ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంది. టీజర్‌ చూస్తున్నప్పుడు చివరిలో రామ్ చరణ్‌ ‘ఐయామ్‌ అన్ ప్రెడిక్టబుల్’ అంటూ డైలాగ్‌ చెప్తాడు. నిజమే అనిపిస్తుంది.

గేమ్ ఛేంజర్‌ ఓ పొలిటికల్ డ్రామా అని మొదటి నుంచే సూచిస్తున్నారు. టీజర్‌లో కూడా అదే చూపారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌ ఓ పల్లెటూరు యువకుడు విద్యార్ధి నాయకుడుగా ఎదిగి ఐఏఎస్ చదివిన తర్వాత రాజకీయాలలో ప్రవేశించి అవినీతిని, అవినీతిపరులను అంతం చేసి రాజకీయ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాడని టీజర్‌ ద్వారా దర్శకుడు శంకర్ చెప్పిన్నట్లు అర్దమవుతోంది.

ప్రజలు రాజకీయాలలో ఎటువంటి మార్పు కోరుకుంటున్నారో, రాజకీయ నాయకులు ఏవిదంగా ఉండాలని కోరుకుంటున్నారో దానిని సినిమాలలో సమర్ధంగా చూపించగలిగితే సూపర్ హిట్ అవుతాయని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి.

దర్శకుడు శంకర్ కూడా గేమ్ ఛేంజర్‌తో అటువంటి ప్రయత్నమే చేసిన్నట్లు భావించవచ్చు. ప్రేక్షకాధరణ పొందిన ఇటువంటి కధకి భారీ సెటింగ్స్, క్యాచీ సాంగ్స్, పంచ్ డైలాగ్స్, ఫైట్స్, ముఖ్యంగా రామ్ చరణ్‌ వంటి గొప్ప నటుడు తోడైయితే ఇక చెప్పక్కరలేదు. టీజర్‌లో అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక గేమ్ ఛేంజర్‌ సూపర్ హిట్ అవడం ఖాయమనే భావించవచ్చు. 

ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు 5 భాషల్లో విడుదల కాబోతోంది.      

Related Post