రాజాసాబ్ స్టోరీ ఇదేనా?

November 01, 2024
img

ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన తర్వాత మారుతి వంటి తెలుగు దర్శకులకి అవకాశం ఇచ్చి అచ్చమైన తెలుగు సినిమా చేస్తుండటం గొప్ప విషయంగానే భావించవచ్చు. అయితే ఈ సినిమా కధ ఏవిదంగా ఉండబోతోంది? అని ఆలోచిస్తే దర్శకుడు మారుతి ఇప్పటికే చాలా హింట్స్ ఇచ్చారు. అవేమిటో చూద్దాం. 

ఇటీవల ప్రభాస్‌ పుట్టినరోజునాడు రాజాసాబ్‌ పోస్టర్‌ వదిలారు. దానిలో ప్రభాస్‌ని వృద్ధ రాజావారిగా చూపారు. అంతకు ముందు పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్‌లో ప్రభాస్‌ని చిలిపిగా యువకుడిగా చూపారు. 

కనుక ఈ సినిమాలో ప్రభాస్‌ రాజావారుగా ఓ పాత్ర, ఆయన కుమారుడో మనుమడిగానో మరో పాత్ర చేయబోతున్నట్లు స్పష్టమైంది. 

ఈ సినిమా హర్రర్-కామెడీ-రొమాన్స్ మూడు ఉంటాయని దర్శకూడు మారుతి ముందే చెప్పేశారు. అలాగే విలన్‌గా బాలీవుడ్‌ సీనియర్ నటుడు సంజయ్ దత్ చేస్తున్నారు. 

కనుక పెద్దరాజాసాబ్‌కి, విలన్‌కి మద్య పాత వైరం.... ఆ వైరంలో రాజాసాబ్‌ని విలన్‌ హత్య చేస్తాడు. అప్పుడు రాజాసాబ్‌ ఆత్మ ఆ బంగాళాలో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురుచూస్తుంటుంది. 

చిన్నరాజావారు హీరోయిన్‌తో రొమాన్స్‌కి ముందో లేదా చేస్తూనో ఆ బంగాళాకు హీరోయిన్‌తో వస్తారు. పెద్దరాజాసాబ్‌, చిన్న రాజాసాబ్ మద్య దోస్తీ ఉంటుంది కనుక కామెడీ, విలన్‌గా కోసం హర్రర్, హీరోయిన్‌తో రొమాన్స్ అన్నీ సమపాళ్ళలో కలుపుకునేందుకు ఈ కధ సరిపోతుంది. 

మారుతి చేతిలో కావలసినంత బడ్జెట్‌, పాన్ ఇండియా హీరోగా పేరొందిన ప్రభాస్‌ వంటి గొప్ప నటుడు అన్నీ ఉన్నాయి. కనుక ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తే చాలు. ప్రేక్షులు సినిమాని సూపర్ హిట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

Related Post