మలయాళ సినీ పరిశ్రమలో మహిళా నటులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదికని కేరళ ప్రభుత్వమే బయటపెట్టడమే కాక వారందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దం అవుతోంది.
దీనిపై కేరళలో ప్రకంపనలు కొనసాగుతుండగానే నటి సమంత స్పందిస్తూ, మలయాళ చిత్రసీమలో జరుగుతున్న లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టి చర్యలు తీసుకుంటున్నందుకు కేరళ ప్రభుత్వం, అలాగే ‘విమెన్ ఇన్ సినిమా సెలెక్టివ్’లను సమంత అభినందించారు.
కేరళలోని ‘విమెన్ ఇన్ సినిమా సెలెక్టివ్’ స్పూర్తితో తెలుగు సినీ పరిశ్రమలో కూడా మహిళల గొంతు వినిపించేందుకు 2019లో ఏర్పడిన ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళా నటులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఇదివరకు ఆ సబ్-కమిటీ విచారణ జరిపి ఇచ్చిన నివేదికని తెలంగాణ ప్రభుత్వం కూడా బయటపెట్టాలని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తద్వారా సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత, సురక్షితమైన వాతావరణం ఏర్పడేందుకు దోహదపడుతుందని సమంత అభిప్రాయపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే ఎవారూ ఎప్పుడూ వాటి గురించి బయటకు చెప్పరు. కొంతమంది ప్రముఖ నటీమణులు చెప్పినా తమని వేధించిన వారి పేర్లు బయట పెడితే తమ కెరీర్ దెబ్బ తింటుందనే భయంతో బయటకు చెప్పరు.
కేరళ నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన సమంతకి కూడా బహుశః అటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. కానీ ఆమె కూడా ఎన్నడూ ఈ అంశం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆమె ఎవరిపై అస్త్రం సందించబోతున్నారో అనే అనుమానం కలుగక మానదు. మరి ఆ ‘ఎవరు’ఎవరో?