మంచు విష్ణు ప్రధానపాత్రలో సిద్దం అవుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నవారి ఫస్ట్-లుక్ పోస్టర్లు ఒకటొకటే విడుదల చేస్తుంటే ఈ సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మంచు విష్ణు (కన్నప్ప), శరత్ కుమార్ (నాధనాధుడు), మధుబాల (పన్నగా), దేవరాజ్ (ముందడు)ల ఫస్ట్-లుక్ పోస్టర్లు వాటిలో వారి నేపధ్యం వెల్లడించిన కన్నప్ప టీమ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తాజాగా ఈ సినిమాలో చండుడుగా నటిస్తున్న సంపత్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది.
‘అడవినే భయభ్రాంతుల్ని చేసే భీకరజాతి బిల్లులు. నల్ల కనుమ నెలలో పుట్టారు. మొసళ్ళ మడుగు నీరు తాగి పెరిగారు. భిల్లజాతి అధినేత చండుడు,’ అంటూ కన్నప్పలో ఆయన పాత్ర గురించి వివరణ ఇచ్చారు.
కన్నప్పలో ఇంతవరకు పరిచయం చేసిన పాత్రలు చూస్తే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అసలు కధకు పూర్తి భిన్నంగా లేదా అసలు కధకి అవసరమైన మసాలా (అడవిలో తెగల మద్య పోరాటాలు) దట్టించి సిద్దం చేస్తున్నట్లు అనిపిస్తుంది. రామాయణ గాధని ‘ఆదిపురుష్’గా ప్రయోగం చేస్తే ఏవిదంగా బెడిసికొట్టిందో బహుశః మంచు విష్ణుకి గుర్తుండే ఉంటుంది. కనుక తన ఈ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’లో నేటి కాలానికి తగ్గట్లు అనవసరమైన మసాలా దట్టించి కన్నప్పని మరో ఆదిపురుష్ చేసుకోడనే ఆశిద్దాం.