రాజమౌళి రికార్డులను నాగ్ అశ్విన్‌ బద్దలు కొట్టబోతున్నారా?

June 26, 2024
img

ఇంతకాలం తెలుగులో అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలంటే ఒక్క రాజమౌళి వలననే సాధ్యం అన్నట్లు ఉండేది. కానీ హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ, ఇప్పుడు కల్కి ఎడి2898 సినిమాతో నాగ్ అశ్విన్‌ ఇద్దరు దర్శకులు మన ముందున్నారు. 

ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్‌ ఇద్దరూ కూడా మూస కధలు కాకుండా  చాలా భిన్నమైన వాటినే ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. 

ముఖ్యంగా నాగ్ అశ్విన్‌ కల్కి ఎడి2898 సినిమాకు తయారుచేసుకున్న కధ, హంగులు చూస్తే ఇంతకాలం ఇండస్ట్రీ ఈ దిశలో ఎందుకు ఆలోచించలేకపోయిందనిపించక మానదు. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు యానిమేషన్ సినిమా వరకు ప్రతీ ఆలోచనా, ప్రయత్నమూ చాలా భిన్నంగానే ఉందని అందరికీ తెలుసు. 

హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ తన సత్తా నిరూపించుకున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్‌ కూడా రేపు విడుదల కాబోతున్న కల్కి ఎడి2898తో తన సత్తా నిరూపించుకోవలసి ఉంది. 

కల్కి ఎడి 2898తో నాగ్ అశ్విన్‌ అంతర్జాతీయస్థాయి గుర్తింపు సాధించి, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో రాజమౌళి నెలకొల్పిన రికార్డ్స్ బద్దలు కొట్టగలిగితే, ఆస్కార్ కూడా సాధించగలిగితే ఇక తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ స్వర్ణయుగం మొదలైన్నట్లే.

Related Post