నట సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఊహించినట్లే బాలయ్య మార్క్ యాక్షన్, పంచ్ డైలాగ్స్‌తో అభిమానులను చాలా ఆకట్టుకొనేలా ట్రైలర్ ఉంది. ఇంతకాలం కాజల్ అగర్వాల్‌ని దాచిపెట్టినప్పటికీ తొలిసారిగా ట్రైలర్‌లో చూపారు.
తండ్రీకూతుర్లుగా నటిస్తున్న బాలకృష్ణ- శ్రీలీలల మద్య భావోద్వేగ సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఈ సినిమాను ఇవే సూపర్ హిట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విలన్ గ్యాంగ్‌తో బాలకృష్ణ ఫైట్స్, విలన్‌గా అర్జున్ రాంపాల్, బాలకృష్ణ పంచ్ డైలాగ్స్ అభిమానులకు అద్భుతంగా అనిపించవచ్చు కానీ కమర్షియల్ సినిమాలో ఇవన్నీ మామూలే.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: ఎస్ఎస్ ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: వి వెంకట్ చేశారు.
ఈ సినిమాలో రాంపాల్, శ్రవణ్, ప్రియాంకా జవల్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ శంకర్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతోంది.