జైశ్రీరామ్… జైశ్రీరామ్ పూర్తి టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

May 20, 2023
img

ఆదిపురుష్‌ సినిమాలో ‘జైశ్రీరామ్… జైశ్రీరామ్... అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ ఇప్పటివరకు కొన్ని చరణాలు మాత్రమే విన్నాము. శనివారం చిత్రబృందం పూర్తిపాటను విడుదల చేసింది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు అజయ్, అతుల్ స్వరపరిచారు. “ఎవరు ఎదురురాగలరు మీ దారికి... ఎవరికుందీ ఆ అధికారం... పర్వతపాదాలు వణికి కదులుతాయి మీ హూంకారానికి...” అంటూ ప్రభాస్‌ వాయిస్ ఓవర్‌తో మొదలైన టైటిల్‌ సాంగ్‌ అద్భుతంగా ఉంది. 

అయితే హిందీ స్వరాలకు అనుగుణంగా తెలుగులో పాట వ్రాయడం వలన అచ్చమైన తెలుగు పాటలా అనిపించదు. సినిమాలో పాత్రధారుల సంభాషణలు కూడా ఇదేవిదంగా సాగితే సినిమా దెబ్బ తినడం ఖాయం. శాకుంతలం సినిమా తెలుగు తెలుగు వెర్షన్‌లో సంభాషణలు ఈవిదంగా ఉండటం కూడా ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారని అందరికీ తెలుసు. కనుక ఆదిపురుష్‌లో పాత్రల తెలుగు సంభాషణలు (డబ్బింగ్) అచ్చమైన తెలుగులో ఉంటుందని ఆశిద్దాం. లేకుంటే ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసిన్నట్లవుతుందని దర్శకనిర్మాతలు మరిచిపోకూడదు.  

ఆదిపురుష్‌లో సీతమ్మవారిగా కృతీ సనన్, రావణుడిగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్, హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు.  

భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మించారు. ఆదిపురుష్‌ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post