శాకుంతలం ట్రైలర్‌ అద్భుతః... కానీ డబ్బింగ్ మాత్రం!

January 09, 2023
img

సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల, దుష్యంతులుగా గుణశేఖర్ తెరకెక్కించిన ప్రేమకావ్యం శాకుంతలం ఫిభ్రవరి 17న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ నెలరోజుల కంటే ముందుగానే ఈరోజు విడుదల చేయడం విశేషం. ట్రైలర్‌లో దర్శకుడు గుణశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్‌, విజువల్ ఎఫెక్ట్స్ పనితనం స్పష్టంగా కనిపిస్తాయి. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం కమ్మటి విందులో పంటి కింద రాయిలా అనిపిచకమానదు. తెలుగులోనే ఈవిదంగా ఉంటే ఇక హిందీలో డబ్బింగ్ ఏవిదంగా ఉంటుందో అనే సందేహం కలుగుతుంది. 

శాకుంతలం ట్రైలర్‌లో సినిమాలో కొన్ని పాత్రలని పరిచయం చేశారు. దూర్వాస మునిగా మోహన్ బాబు, అసుర పాత్రలో బాలీవుడ్‌ నటుడు కబీర్ సింగ్, ప్రియంవదగా అనన్యా నాగల్ల, అనసూయగా అదితి బాలన్, గౌతమిగా గౌతమి, మహీపాలగా మల్హోత్రా శివం, బాల భరతుడిగా అల్లు అర్జున్‌ కుమార్తె అర్హలని పరిచయం చేశారు. 

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల, దుష్యంతులుగా చేస్తున్న శాకుంతలం సినిమాని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా ఫిభ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post