డీజే టిల్లు ... హీరోయిన్‌ మళ్ళీ మారిందట?

November 29, 2022
img

విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌ తీసేందుకు హీరోయిన్ల ఎంపిక మొదలుపెట్టారు. డీజే టిల్లులో నటించిన నేహా శెట్టినే మొదట హీరోయిన్‌గా అనుకొని షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ హటాత్తుగా ఆమెను పక్కన పెట్టి శ్రీలీలని తీసుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెని కూడా కాదని చివరికి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ పేరుని ఖరారు చేశారు. కానీ అనుపమ కూడా డీజే టిల్లుకి బై చెప్పి వెళ్ళిపోయినట్లు తాజా సమాచారం. కనుక ఇప్పుడు ఆమె స్థానంలో ప్రేమమ్ హీరోయిన్‌ మడోన్నా సెబాస్టియన్‌ని తీసుకోవాలని దర్శక,నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆమె ఉంటుందా వెళ్ళిపోతుందా?ఇక సీక్వెల్‌గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’లో దర్శకుడు కూడా మారిపోయాడు. విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ దర్శకత్వం చేయబోతున్నాడు. 

డీజే టిల్లు ఫస్ట్ పార్ట్‌కి లేని ఇబ్బంది సీక్వెల్‌కి ఎందుకు కలుగుతోంది? ఇంతమంది హీరోయిన్లను ఎందుకు మార్చవలసివస్తోంది?దర్శకుడు ఎందుకు వెళ్లిపోయాడు? ఒక సినిమా హిట్ అవగానే జొన్నలగడ్డ సిద్దు హీరోయిన్ల ఎంపికలో వేలుపెడుతున్నాడా?లేక హీరోయిన్లే తమ స్థాయికి అతను తగడని వెళ్ళిపోతున్నారా? హీరోయిన్లు సరే దర్శకుడుని కూడా ఎందుకు మార్చాల్సి వచ్చింది?దర్శకత్వంలో కూడా సిద్దు వేలుపెడుతున్నాడా?

Related Post