రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్లే!

September 13, 2022
img

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కధ అందిస్తున్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, వారి కాంబినేషన్‌, ఇమేజ్ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రెండు విభిన్నమైన కధలు సిద్దం చేస్తున్నారు. వాటిలో ఒకటి అమెజాన్ అడవులలో నిధి కోసం వేట కధాంశం కాగా మరొకటి జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో యాక్షన్ కధాంశం. ఈ రెండూ తయారైన తర్వాత వాటిలో తమకు ఏది నచ్చుతుందో, ఏది బాగా సరిపోతుందో దానిని తీసుకొని సినిమా తీస్తామని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఇటీవల టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నప్పుడు రాజమౌళి ఈ సినిమా గురించి చెపుతూ, “ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కధ”తో ఈ సినిమాను తీయబోతున్నట్లు చెప్పారు. 

ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో మొదలుపెట్టే అవకాశం ఉంది. రాజమౌళి సినిమా అందునా ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కధతో సినిమా అంటే కనీసం మూడు నాలుగేళ్ళు పైనే పట్టవచ్చు. బహుశః అందుకే “రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్లే” అని మహేష్ బాబు కామెంట్ చేసాడేమో?కానీ ఈ సినిమా పూర్తయ్యేవరకు మహేష్ బాబు మరో సినిమా చేయలేడు కనుక అది మొదలయ్యేలోగా మరో రెండు సినిమాలైన పూర్తిచేయగలిగితే చాలని అభిమానులు కోరుకొంటున్నారు.

Related Post