మా విడాకుల గురించి ఇంత చర్చ ఎందుకు?నాగ చైతన్య

August 01, 2022
img

సామాన్య ప్రజల జీవితాలలో ఏవైనా అనూహ్య ఘటనలు జరిగితే అది బంధుమిత్రులు, ఇరుగుపొరుగుల వరకు పరిమితం అవుతుంది. కానీ అదే... సెలబ్రేటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నవారి జీవితాలలో జరిగే చిన్న పరిణామం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కనుక మీడియా, సోషల్ మీడియా కూడా మరింత ఎక్కువ ఫోకస్ పెడుతుంది. దాంతో ఉన్నవీ లేనివీ ప్రచారంలోకి వచ్చేస్తాయి. 

సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో కూడా అదే జరుగుతోంది. వారు విడిపోయి ఎవరిదారిలో వారు బ్రతకాలనుకొంటున్నామని చెప్పినప్పటికీ, ఎందుకు విడిపోతున్నారో చెప్పకపోవడంతో నేటికీ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

తొలిసారిగా నాగ చైతన్య వాటిపై స్పందిస్తూ, “నేను నా సినీ జీవితంలో సాధించిన విజయాలపై ఎవరికీ ఆసక్తి లేదు కానీ నా వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగిందనే దానిపై అనవసరమైన ఆసక్తి కనబరుస్తున్నారు. మా విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు వినివినీ విసుగెత్తిపోయాను. కానీ వాటిపై స్పందించడం మొదలుపెడితే అవి ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవని నాకు తెలుసు. అందుకే నా వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని పుకార్లు పుట్టుకొస్తున్నా నేను స్పందించడం లేదు. ఒక న్యూస్‌ని మరో న్యూసే రీప్లేస్ చేస్తుంటుంది. ఏదో ఓ రోజున ఈ న్యూస్‌ను కూడా మరో న్యూస్ రీప్లేస్ చేస్తుందని ఈ కధ ముగుస్తుందని ఆశిస్తున్నాను. మేము ఎందుకు విడిపోయామో.... కారణాలు ఏమిటో మా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరికీ తెలుసు. కనుక నేను అందరికీ వివరణ ఇచ్చుకొంటూ కూర్చోలేను,” అని నాగ చైతన్య చెప్పారు.          

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత ‘తమ కాపురం ఏమంత గొప్పగా సాగలేదని, ఇద్దరినీ ఒకే గదిలో బందించి ఉంచితే ఒకరినొకరు పొడుచుకొనే అంత శతృత్వంతో జీవించామని’ చెప్పింది. ఆమె అన్న ఈ ఒక్క మాట మళ్ళీ వారి విడాకులపై చర్చలు కొనసాగించేందుకు మీడియాకు మరో అవకాశం కల్పించింది. ఇప్పుడు నాగ చైతన్య చెప్పిన ఈ మాటలు వాటిని కొనసాగించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప నాగ చైతన్య కోరుకొంటున్నట్లు వారి కధకు ముగింపుని ఇవ్వవని వేరే చెప్పక్కరలేదు. కనుక నాగ చైతన్య చెప్పినట్లు ఈ న్యూస్‌ని రీప్లేస్ చేసే మరో న్యూస్ ఎప్పుడొస్తుందో అప్పటివరకు వారిరుయివురూ కూడా ఎదురు చూడక తప్పదు. 

Related Post