లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాల!

May 18, 2022
img

వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ కౌర్ జంటలుగా వచ్చిన సూపర్ హిట్ ఎఫ్2కి సీక్వెల్‌గా తీసిన ఎఫ్3ఈ నెల 27న వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమాలో ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా...’ అంటూ ఉర్రూతలూగించే పక్కా మాస్ బీట్‌తో మూడో వీడియో సాంగ్‌ నిన్న విడుదల చేశారు. దానిలో పూజా హెగ్డే చేసిన డ్యాన్స్ ‘అల వైకుంటపురంలో’ ‘బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా...’ డ్యాన్స్‌ను మరిపించేలాగ ఉంది. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దిల్‌ రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై శిరీష్ దీనిని నిర్మించారు. ఎఫ్3 కామెడీ టీంలో కొత్తగా ఆలీ, సునీల్ కూడా వచ్చి చేరడంతో ఈసారి కామెడీకి హద్దులే ఉండకపోవచ్చు. 

మరో విశేషమేమిటంటే, ఎఫ్3 సినిమా టికెట్ ధర పెంచడం లేదు కనుక ప్రేక్షకులు సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించవచ్చు.  


Related Post