అమెజాన్ ప్రైమ్‌లో సర్కారువారి పాట?

May 17, 2022
img

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట చిత్రంపై కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ సినిమా నిలద్రొక్కుకొని రెండు రోజులలో రూ.103 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించి దూసుకుపోతోంది. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా ఏదో ఓ రోజు ఓటీటీలో రిలీజ్ చేయక తప్పదు కనుక ఓటీటీ ప్రేక్షకులు సర్కారువారి పాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

అయితే సినీ ఇండస్ట్రీ-ఓటీటీ సంస్థలకు మద్య ఇదివరకు కుదిరిన ఒప్పందం ప్రకారం, థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమాలాగ భారీ అంచనాలు ఉన్నట్లయితే ముందే అగ్రిమెంటులో మరికొన్ని రోజులు అదనంగా వ్రాసుకొంటారు. అందుకే ఆర్ఆర్ఆర్‌ రెండు నెలల తరువాత ఓటీటీలో విడుదలవుతోంది. 

అమెజాన్ ప్రైమ్ సంస్థ సర్కారువారి పాటకు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకొంది. అయితే గడువు ప్రకారం నాలుగు వారాల తరువాత ఓటీటీలో విడుదల చేసుకొనేందుకు వీలుగా అగ్రిమెంట్ చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయ్యింది కనుక జూన్‌ 12 లేదా 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయే అవకాశం ఉంది. కనుక అంతవరకు ఓటీటీ ప్రేక్షకులు సర్కారువారి పాట కోసం ఎదురుచూడక తప్పదు.  

Related Post