బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేష్ బాబు

May 10, 2022
img

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ‘బాలీవుడ్ నన్ను భరించలేదని’ సమాధానం చెప్పారు. అడవి శేష్ నటించిన మేజర్ సినిమా ట్రైలర్ నిన్న హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై తన మనసులో అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా చెప్పారు. 

“నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లే వచ్చాయి. కానీ బాలీవుడ్ నన్ను భరించలేదని భావిస్తున్నాను. కనుక నన్ను భరించలేని హిందీ పరిశ్రమలో పనిచేసి టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే నాకు ఎంతో గౌరవం, గుర్తింపు, స్టార్ డమ్ కల్పించిన తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలు చేసుకోవడమే మేలని భావిస్తున్నాను. ఇక్కడ తెలుగు సినిమాలు చేసుకొంటూ నేను చాలా తృప్తిగా, సంతోషంగా ఉన్నాను. ఇక్కడే మరిన్ని మంచి సినిమాలు చేస్తూ అందరి మెప్పు పొందితే అదే పదివేలనుకొంటున్నాను. కనుక నాకు ఇంత గౌరవం, గుర్తింపు ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమను విడిచి ఎక్కడికో వెళ్ళి పనిచేయాలనుకోవడం లేదు. నాకు ఇదే చాలు,” అని అన్నారు. 


Related Post