రొమాంటిక్ : రివ్యూ

October 29, 2021
img

పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా వచ్చిన సినిమా రొమాంటిక్. పూరీ జగన్నాథ్ కథ, మాటలు అందించిన ఈ సినిమాను అనీల్ పాడూరి డైరెక్ట్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తల్లిదండ్రులు లేక నాన్నమ్మ పెంపకంలో పెరుగుతాడు వాస్కోడిగామా (పూరీ ఆకాష్). చిన్నప్పటి నుండి ఎన్నో కసహ్టాలు పడటంతో తనలా మరెవరు కష్టాలు పడకూడదు అనుకుని నాన్న పేరు మీద ట్రస్ట్ పెడతాడు. తనలాంటి వారందరిని ఆదుకునేందుకు డబ్బు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటాడు. ఇదే క్రమంలో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరతాడు. తను పనిచేస్తున్న గ్యాంగ్ లోని బాసునే చంపి ఆ గ్యాంగ్ కు లీడర్ అవుతాడు. ఇలా నడుస్తున్న తన లైఫ్ లోకి మోనిక (కేతిక శర్మ) అడుగుపెడుతుంది. ఆమెను చూడగానే హీరోలో వింత కోరికలు పుడతాయి. మోనిక అతన్ని దూరం పెడుతున్నా కావాలని ఆమెకు దగ్గరయ్యే ప్రాయ్త్నం చేస్తాడు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఏసీబీ (రమ్యకృష్ణ) వాస్కోడిగామాని టార్గెట్ చేస్తుంది. హీరోకి జీవిత ఖైదు కూడా పడుతుంది. ఇంతకీ వాస్కోడిగామా బయటకు వచ్చాడా..? మోనికతో అతనికి ఉన్న రిలేషన్ ఏంటి..? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

పూరీ జగన్నాథ్ రొటీన్ గా రాసుకున్నె గ్యాంగ్ స్టర్ కథలానే రొమాంటిక్ కథ సాగింది. అయితే హీరో, హీరోయిన్ మధ్య లవ్ అని కాకుండా ఒకరిని చూడగానే మరొకరికి కోరిక పుట్టడం లాంటి అడల్ట్ కంటెంట్ ను ఈ సినిమాతో చెప్పారు. హీరో, హీరోయిన్ ఇద్దరు అదే ఫీలింగ్ లో ఉంటే ఏసీబీకి మాత్రం వీరి మధ్య ఉన్న లవ్ స్టోరీ అర్ధమవుతుంది.

సినిమా అంతా పూరీ మార్క్ కనిపిస్తుంది. అదే గ్యాంగ్ ఫైట్.. మాస్ ఎలిమెంట్స్ తో కానిచ్చారు. కొన్నిచోట్ల డైలాగ్స్ బాగున్నాయి. యూత్ ఆడియెన్స్ కు హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు కోరికతో ఉంటూ అదే ప్రేమగా చివర్లో చూపించడం ఆడియెన్స్ కూడా షాక్ అవుతారు.

సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్, ఎంటర్టైనర్ సినిమాలను చూసే వారికి నచ్చకపోవచ్చు. రొటీన్ పూరీ మార్క్ మూవీగా రొమాంటిక్ వచ్చింది.

నటన, సాంకేతికవర్గం :

ఆకాష్ పూరీ తన పాత్ర వరకు బాగా చేశాడు. అయితే కొన్నీచోట్ల గ్యాంగ్ లీడర్ గా అంత వెయిట్ ఉన్న పాత్ర మోయడంలో అనుభవ రాహిత్యం కనబడుతుంది. మెహబూబా సినిమా కన్నా ఇందులో నటన పరిణితి సాధించాడు. ఇక కేతిక శర్మ అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సినిమా చూసిన యూత్ ఆడియెన్స్ ఆమెని ఇష్టపడతారు. అందం, అభినయం కేతిక శర్మ రెండిటిలో మెప్పించింది. రమ్యకృష్ణ తనకు ఇచ్చిన పాత్రను బాగా చేశారు. ఉత్తేజ్, రమాప్రభ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది. బిజిఎం కూడా అలానే సాగింది. నరేష్ రాణా సినిమాటోగ్రఫీ బాగుంది. పూరీ కథ రొటీన్ గా ఉండగా మాటలు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకున్నాయి. అనీల్ పాడూరి డైరక్షన్ పూరీని దించేశాడని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కేతిక శర్మ

సినిమాటోగ్రఫీ

పూరీ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

రొమాంటిక్.. యూత్ ఆడియెన్స్ కోసమే..!

రేటింగ్ : 2/5


Related Post