వరుడు కావలెను : రివ్యూ

October 29, 2021
img

 నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో వచ్చిన సినిమా వరుడు కావలెను. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.


కథ : 

విదేశాల్లో ఆర్కిటెక్చార్ గా మంచి పేరుతెచ్చుకున్న ఆకాష్ (నాగ శౌర్య) ఫారిన్ లైఫ్ స్టైల్ నచ్చక హైదరాబాద్ వచ్చేస్తాడు. భూమి (రీతు వర్మ) హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్ కంపెనీ నడిపిస్తుంది. భూమి అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. 30 ప్లస్ అయినా పెళ్లి చేసుకోదు.. భూమికి పెళ్లి చేయాలని ఆమె పేరెన్స్ చూస్తుంటారు. ఓ పక్క తనకు సంబంధాలు చూస్తుంటే.. భూమికి దగ్గరవ్వాలని చూస్తాడు ఆకాష్. ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. ఆకాష్, భూమి మొదట్లో వారి అభిరుచులు కలిసినట్టు అనిపించినా కొన్ని కారణాల వల్ల వారు దూరం అవుతారు. ఆకాష్, భూమి దూరమవడానికి కారణాలు ఏంటి..? వారిద్దరు ఎలా కలిశారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

నూతన దర్శకురాలు సౌజన్య మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వరుడు కావలెను ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చుతుంది. అయితే కథలో ట్విస్టులు, మాస్ ఎలిమెంట్స్ ఆశించే వారికి నిరాశే కలుగుతుంది. సినిమాకు మ్యూజిక్ కూడా ఆకర్షణగా నిలిచింది.

కూతురికి త్వరగా పెళ్లి చేయాలని తపన పడే తల్లి.. పెళ్లి కన్నా ఆమె సంతోషకరమైన జీవితం ముఖ్యమని చెప్పే తండ్రి. పెళ్లి అంటే చాలు ఎలా ఆపేద్దాం అనుకునే హీరోయిన్.. చాలా టఫ్ గా కనిపించే హీరోయిన్ ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నించే హీరో. ఇదే వరుడు కావలెను కథా సారాంశమని చెప్పొచ్చు. 

సినిమాలో చాలా వరకు డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే క్లైమాక్స్ మాత్రం అందరు గెస్ చేసే విధంగా ఉంటుంది. రొటీన్, వెరైటీ అని కాదు కాని సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి ఎంజ్యా చేసేలా ఉంది. 

నటన, సాంకేతికవర్గం :

ఆకాష్ పాత్రలో నాగ శౌర్య చాలా బాగా చేశాడు. సినిమా మొత్తం క్లాస్ లుక్ తో నాగ శౌర్య అదరగొట్టాడు. ఇక హీరోయిన్ రీతు వర్మ కూడా అలరించింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రీతు వర్మ దాన్ని బాగా చేసింది. ఇక మురళీ శర్మ, నదియా పాత్రలు ఆకట్టుకున్నాయి. వెన్నెల కిశోర్, సప్తగిరి కామెడీ ఇంప్రెస్ చేసింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్, థమన్ ఇద్దరు సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బిజిఎం ఆకట్టుకుంది. వంశీ సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. డైరక్టర్ లక్ష్మి సౌజన్య రొటీన్ కథనే కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నాగ శౌర్య, రీతు వర్మ

సినిమాటోగ్రఫీ

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

వరుడు కావలెను.. జస్ట్ ఓకే అనిపించాడు..!

రేటింగ్ : 2.75/5

Related Post