మహా సముద్రం : రివ్యూ

October 14, 2021
img

ఆరెక్స్ 100 సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన అజయ్ భూపతి తన సెకండ్ ప్రాజెక్ట్ గా మహా సముద్రం తీశాడు. శర్వానంద్, సిద్ధార్థ్ లు కలిసి నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్థ్) ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వైజాగ్ లో ఉంటున్న వీరిలో అర్జున్ సొంతమా బిజినెస్ చేసుకోవాలని అనుకుంటాడు. గొడవలకు ముందుంటాడు. విజయ్ ఎస్సై జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తుంటాడు. గొడవలు వద్దని చెబుతాడు. విజయ్ మహా (అదితి రావు హైదరి)ని ప్రేమిస్తాడు. మాఫియా డాన్ ధనుంజయ్ తో గొడవల వల్ల మహా ఇబ్బంది పడుతుంది. ఆ టైం లో విజయ్ వైజాగ్ వదిలి వెళ్తాడు. నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చిన విజయ్, అర్జున్ ల మధ్య స్నేహం శత్రుత్వంగా మారుతుంది. ఇంతకీ అర్జున్ ఏం చేశాడు..? విజయ్, అర్జున్ ల మధ్య ఏం జరిగింది..? ఇంతకీ ఈ మహా ఎవరు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఆరెక్స్ 100 సినిమాతో హీరోయిన్ ను నెగటివ్ గా చూపించి చాలా పెద్ద సాహసమే చేశాడు అజయ్ భూపతి. ఇక మహా సముద్రం విషయానికి వస్తే కథ పర్లేదు అనిపించగా కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా పర్లేదు అనిపించగా సెకండ్ సినిమాను ట్రాక్ తప్పించేశాడు డైరక్టర్ అజయ్.

సెకండ్ హాఫ్ ట్విస్టులు రొటీన్ గా ఉంటాయి. సినిమా మీద రెండు ట్రైలర్స్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన అజయ్ భూపతి. సినిమా కథ, కథనాల్లో ఆ అంచనాలకు తగినట్టుగా తెరకెక్కించలేదు. సినిమాలో ఇద్దరి హీరోల స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య సీన్స్, హీరోయిన్ అదితి పాత్ర ఇవన్ని మెప్పించాయి. 

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా పోస్టర్స్ లో ఇమ్మెజరబుల్ లవ్ అని చెప్పిన అజయ్ భూపతి. కథ, కథనాల్లో ఆ రేంజ్ ను మాత్రం చూపించలేదు. టేకింగ్ వైజ్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త పర్ఫెక్ట్ గా చేయాల్సిందని చెప్పొచ్చు. 

నటన, సాంకేతికవర్గం :

సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ ల నటన ఆకట్టుకుంది. ఇద్దరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదితి రావు హైదరి కూడా అలరించింది. మహా పాత్రలో అదితి సూపర్ గా చేసింది. ఇక శ్వేత పాత్రలో అను ఇమ్మాన్యుయెల్ జస్ట్ ఓకే అనిపించుకుంది. సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ ల నటన ఆకట్టుకుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సాంగ్స్ కన్నా బిజిఎం బాగా ఇచ్చాడు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. వైజాగ్ అందాలు బాగా చూపించారు. డైరక్టర్ అజయ్ భూపతి మహా సముద్రం ఇమ్మెజరబుల్ లవ్ అంటూ రొటీన్ కథతోనే వచ్చారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకు అనుకున్న దానికన్నా బాగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది.

ఒక్కమాటలో :

మహా సముద్రం.. జస్ట్ ఓకే..!

రేటింగ్ : 2.75/5


Related Post