గల్లీ రౌడీ : రివ్యూ

September 17, 2021
img

సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా గల్లీ రౌడీ. ఎం.వి.వి సినిమాస్ బ్యానర్ లో ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను కోనా వెంకట్ సహ నిర్మాతగా ఉన్నారు. చాలా సినిమాలు ఓటీటీకి వెళ్తున్న ఇలాంటి టైం లో గల్లీ రౌడీ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

వైజాగ్ లో బైరాగి (మీమ్ గోపీ) చేస్తున్న అరాచక పనులను అడ్డుకున్న వాసు (సందీప్ కిషన్)  తాతని అవమానపరుస్తాడు. అప్పుడు వాసు తాత మనవడు వాసుని పెద్ద రౌడీగా తయారు చేఆలని అనుకుంటాడు. వాసుకి మాత్రం ఇలాంటివి ఇష్టం ఉండదు. అయితే అనుకోకుండా వాసు ఇష్టపడే సాహిత్య (నేహా శెట్టి) కోసం వాసు రౌడీ గా మారుతాడు. బైరాగిని కిడ్నాప్ చేయాలనే ప్లాన్ చేసిన వాసుకి అతని హత్య రిస్క్ లో పడేస్తుంది. ఈ సమస్యల నుండి వాసు ఎలా బయటపడ్డాడు..? బైరాగిని చంపింది ఎవరు..? సాహిత్య ఫ్యామిలీని ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

గల్లీ రౌడీ అనే మాస్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా రొటీన్ కథ, కథనాలతో వచ్చిందని చెప్పొచ్చు. ఏమాత్రం కొత్తదనం లేని ఈ సినిమా నాగేశ్వర్ రెడ్డి మార్క్ ఔట్ డేటెడ్ ఇల్లాజికల్ కామెడీతో వచ్చింది. సినిమా కథ, కథనాలు ఇవన్ని కామెడీగా నడిపించారు. 

ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తం కామెడీగా నడిపించాలన్న ఆలోచన బాగున్నా.. అది కొత్త పంథాలో తీసుకెళ్తే బాగుండేదని అనిపిస్తుంది. రొటీన్ సినిమాగా గల్లీ రౌడీ ఆడియెన్స్ కు బోర్ కొట్టించేస్తాడు. 

అయితే కథ, కథనాలతో సంబంధం లేదు జస్ట్ టైం పాస్.. ఎంటర్టైన్ అవడానికి సినిమా చూసే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కథ కొత్తగా ఉండాలి.. ట్విస్టులు ఉండాలని అనుకునే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చదు.

నటన, సాంకేతిక వర్గం :

వాసు పాత్రలో సందీప్ కిషన్ జస్ట్ ఓకే అనిపించాడని చెప్పొచ్చు. సినిమాలో సందీప్ కిషన్ టైమింగ్ అలరిస్తుంది. హీరోయిన్ నేహా శెట్టి పెద్దగా ఆకట్టుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ ఆయన రెగ్యులర్ మార్క్ పాత్రలోనే కనిపించారు. బాబీ సింహా, మీమ్ గోపీలను సరిగా వాడుకోలేదు. నాగినీడు, వెన్నెల కిశోర్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సాయి కార్తీక్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. బిజిఎం కొద్దిగా లౌడ్ గా అనిపిస్తుంది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సోసోగానే ఉన్నాయి. భాను భోగవరపు అందించిన కథ రొటీన్ గానే ఉంది. కోనా వెంకట్ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మరోసారి ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు. 

ఒక్కమాటలో :

సందీప్ కిషన్ గల్లీ రౌడీ.. రొటీన్ సినిమానే బాసు..!

రేటింగ్ : 2/5


Related Post