మాస్ట్రో : రివ్యూ

September 17, 2021
img

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాదున్ సినిమా తెలుగు రీమేక్ గా మాస్ట్రో తెరకెక్కించారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూదాం.

కథ :

అరుణ్ (నితిన్) ఒక పియానో ప్లేయర్. ప్రపంచానికి అందుడిగా కనిపించే అరుణ్ అందుడిగానే అందరిని నమ్మిస్తాడు. అరుణ్ పర్ఫార్మెన్స్ నచ్చిన సినీ నటుడు మోహన్ (నరేష్) తన రెండో భార్య సిమ్రన్ (తమన్నా) తో మ్యారేజ్ యానివర్సరీకి ప్రైవేట్ కన్సర్ట్ చేయాలని అంటాడు. మోహన్, సిమ్రాన్ ల వెండ్డింగ్ డే నాడు వాళ్ల ఇంటికి వెళ్లిన అరుణ్ అక్కడ మోహన్ హర్యకు గురవడంతో రిస్క్ లో పడతాడు. ఇంతకీ మోహన్ ను చంపింది ఎవరు..? అరుణ్ ఈ అనూహ్య పరిణామాల నుండి ఎలా బయట పడ్డాడు..? అరుణ్ జీవితం ఎలా మలుపులు తిరిగింది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

బాలీవుడ్ లో హిట్టైన అందాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు నితిన్. అయితే ఆ సినిమాలో ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మిస్ అయిందని చెప్పొచ్చు. అంతేకాదు సినిమాలో కొన్ని సీన్స్ లో నితిన్ జస్ట్ ఓకే అనిపించాడని అనిపిస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధి అందాదున్ సినిమాను యాజిటీజ్ ఫాలో అయ్యాడని చెప్పొచ్చు.

చిన్న చిన్న మారుపులు తప్ప.. డైరక్టర్ పెద్దగా మార్పులు చేసింది ఏమి లేదని చెప్పొచ్చు. అయితే సీనియర్ యాక్టర్ నరేష్ కు సెకండ్ వైఫ్ గా తమన్నా లాంటివి ఆడియెన్స్ కు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్పీడ్ గా లాగించిన డైరక్టర్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో గా నడిపించాడని చెప్పొచ్చు. అయితే సినిమాలో ట్విస్టులు మాత్రం అందరిని అలరించాయి.

బాలీవుడ్ లో మంచి ఫలితాన్ని తెచ్చుకున్న అందాదున్ ను తెలుగు రీమేక్ గా చేసిన ప్రయత్నం బాగున్నా ఎక్కడో ఏదో మిస్ అయ్యింది అన్న భావన కలుగుతుంది. థ్రిల్లర్ జానర్ సినిమాలు చూసే ఆడియెన్స్ ను మాస్ట్రో నచ్చే అవకాశం ఉంది.

నటన, సాంకేతికవర్గం :

అరుణ్ పాత్రలో నితిన్ జస్ట్ ఓకే అనిపించాడు. అసలైతే అరుణ్ పాత్రలో ఇంకాస్త ఇన్వాల్వ్ అయ్యి చేసి ఉంటే బాగుండేది అనిపించింది. నితిన్ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాలో తమన్నా గ్లామర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాలో ఆమె లుక్స్ విషయంలో బాగా కేర్ తీసుకున్నారు. ఇక నభా నటేష్ కూడా అలరించింది. విలన్ గా నటించిన జిష్ణు సేన్ పర్వాలేదు అనిపించాడు. హర్షవర్ధన్, మంగ్లీ, రచ్చ రవి, శ్రీముఖి తమ పాత్రలతో మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మహతి స్వర సాగర్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే అతను ఇదివరకు ఇచ్చిన ఆల్బంస్ లో ఇది తక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. బిజిఎం ఓకే. కెమెరా మెన్ పనితం ఇంప్రెస్ చేస్తుంది. డైరక్టర్ మేర్లపాక గాంధి యాజిటీజ్ అందాదున్ ను దించేశాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఒక్కమాటలో : 

నితిన్ మాస్ట్రో.. జస్ట్ ఓకే..!

రేటింగ్ : 2.5/5


Related Post