సీటీమార్ : రివ్యూ

September 10, 2021
img

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సీటీమార్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చి ఫైనల్ గా ఈ శుక్రంవారం వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల పరిస్థితులు అన్ని సర్ధుకోకపోయినా డేర్ చేసి సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

కార్తీక్ (గోపీచంద్) కబడ్డీ కోచ్. స్పోర్ట్స్ కోటా ద్వాఅ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్న కార్తీక్ కడియంలో తన తండ్రి స్థాపించిన స్కూల్ మూతపడే పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని. తను ఏర్పరచిన కబడ్డీ జట్టుతో నేషనల్ కాంపిటీషన్స్ లో వారిని గెలిపించాలని అనుకుంటాడు. ఢిల్లీలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనాల్సిన కబడ్డీ టీం అంతా కిడ్నాప్ అవుతారు. ఇంతకీ జట్టుని కిడ్నాప్ చేసింది ఎవరు..? తన జట్టుని జాతీయ స్థాయి పోటీల్లో హీరో గెలిపించాడా..? కార్తీక్ తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన సంపత్ నంది రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో మెప్పించాడు. మరోసారి అలాంటి మాస్ కథతోనే సీటీమార్ అని వచ్చాడు. తను రాసుకున్న మాస్ యాంగిల్ కథకు కబడ్డీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. మొదటిభాగం మొత్తం గోదావరి పల్లె వాతావరణం తో పాటుగా క్రీడల పట్ల అన్నాయిల తల్లిదండ్రుల్లో ఉన్న అపోహల గురించి బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో అన్నపూర్ణమ్మ అండ్ గ్యాంగ్ చేసే కామెడీ అలరించింది.

ఇక సెకండ్ హాఫ్ ఢిల్లీ లో వారు కబడ్డీ ఆడేందుకు వెళ్లడం.. అక్కడ విలన్ వారిని అడ్డుపడటం చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్సన్ ఘట్టాలతో అలరించారు. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నారు. 

అయితే కబడీ నేపథ్యం తప్ప మిగతా సినిమా అంతా పక్కా రొటీన్ కమర్షియల్ సినిమాగా అనిపిస్తుంది. మాస్ సినిమాలు ఇష్టపడే ఆడియెన్స్ కు సీటీమార్ నచ్చేస్తుంది.

నటన, సాంకేతిక వర్గం :

కార్తీక్ పాత్రలో గోపీచంద్ నటన ఆకట్టుకుంది. ఇలాంటి మాస్ పాత్రల్లో గోపీచంద్ ఎప్పటిలానే తన సత్తా చాటాడు. తమన్నా తెలంగాణా యాసలో ప్రయత్నించి మెప్పించింది. హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ పెద్దగా లేదని చెప్పొచ్చు. విలన్ తరుణ్ అరోరా జస్ట్ ఓకే అనేలా చేశాడు. దివ్యాంగనా మెప్పించింది. రావు రమేష్ కబడ్డీ జట్టులో నటీనటులంతా ఇంప్రెస్ చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మణిశర్మ మ్యూజిక్ ఆకట్టుకుంది. రెండు సాంగ్స్ తో పాటుగా బిజిఎం అదరగొట్టారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అలరించింది. కెమెరా వర్క్ బాగుంది. డైరక్టర్ సంపత్ నంది రెగ్యులర్ మాస్ కథనే కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కించాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : 

గోపీచంద్ సీటీమార్.. మాస్ ఆడియెన్స్ ఇంప్రెసివ్..!

రేటింగ్ : 2.75/5

Related Post