తిమ్మరుసు : రివ్యూ

July 30, 2021
img

సత్యదేవ్, ప్రియాంకా జవల్కర్ జోడీగా శరణ్ కొప్పిశెట్టి డైరక్షన్ లో వచ్చిన సినిమా తిమ్మరుసు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రామచంద్ర (సత్యదేవ్) ఒక మంచి లాయర్ గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. పేదవాడికి కూడా న్యాయం జరగాలని కోరుకునే సిన్సియర్ లాయర్ రామచంద్రం. ఈ టైం లో క్యాబ్ డ్రైవర్ అరవింద్ (చైతన్య) హత్య కేసులో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వాసు (అంకిత్)కు న్యాయం చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో 8 ఏళ్ల క్రితం కేసుని మళ్లీ తెరిపిస్తాడు. ఈ టైంలో లాయర్ అను (ప్రియాంకా) రామచంద్రకు సాయం చేస్తుంది. ఇంతకీ ఈ కేసులో రామచంద్రం గెలిచాడా..? ఈ కేసు విషయంలో అతను తెలుసుకున్న నిజాలు ఏంటి..? ఈ కేసు విషయంలో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో తిమ్మరుసుగా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్ అని చెప్పడానికి లేదు కేవలం కథ మాత్రమే అక్కడ నుండి ఎత్తుకొని తెలుగు వర్షన్ కొత్తగా రాసుకున్నాడు. సాధారణంగా కోర్ట్ రూం డ్రామా సినిమాల్లో పెద్దగా ట్విస్టులు ఉండవు అక్కడ అంతా స్క్రీన్ ప్లే నడుస్తుంది. కాని తిమ్మరుసు సినిమాలో కోర్ట్ రూం డ్రామానే కాని సస్పెన్స్ థ్రిల్లర్ లా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తుంటాయి. 

ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త దృష్టి సారిస్తే బాగుండేదని అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేశాడని మాత్రం అనిపిస్తుంది.

సత్యదేవ్ ఇంతవరకు చేయని కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా వచ్చింది. ఫస్ట్ హా కొద్దిగా స్లో అనిపించగా సెకండ్ హాఫ్ పరుగులు తీయించాడు దర్శకుడు. 

నటన, సాంకేతిక వర్గం :

సత్యదేవ్ ఈ సినిమాలో మంచి కమర్షియల్ హీరోగా కనిపిస్తాడు. సినిమా అంతా తన నటనతో మెప్పించాడు. ప్రియాంకా జవల్కర్ కూడా ఓకే అనిపిస్తుంది. బ్రహామి కామెడీ అలరిస్తుంది. అజయ్ కూడా తన నటనతో ఇంప్రెస్ చేశాడు. అంకిత్, రవి బాబు పాత్రలు మెప్పించాయి. మిగతా వారు పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బిజీఎం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. సినిమా ఫస్ట్ ఫ్రేం నుండి ఆ మూడ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కెమెరా మెన్. డైరక్టర్ శరణ్ కొప్పిశెట్టి తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా ఉంటే సినిమా టాక్ ఇంకాస్త బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఒక్కమాటలో :

సత్యదేవ్ తిమ్మరుసు.. జస్ట్ ఓకే..!

రేటింగ్ : 2.5/5


Related Post