నారప్ప : రివ్యూ

July 20, 2021
img

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన సినిమా నారప్ప. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ నారప్ప సినిమాను సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను నిర్మించారు. సినిమా అమేజాన్ ప్రైం లో రిలీజైంది. 

కథ :

తనకున్న మూడు ఎకరాల భూమిని కాపాడుకుంటూ వస్తుంటాడు నారప్ప (వెంకటేష్). భార్య సుందరమ్మ (ప్రియమణి) పెద్ద కొడుకు మునికన్న (కార్తీక్ రత్నం), సిన్నబ్బ (రాఖీ), తన కూతురుతో తన జీవనం సాగిస్తుంటాడు. అయితే ఊళ్లో అగ్ర కులానికి చెందిన పండుసామి (ఆడుకులం నరేన్) కు నారప్ప 3 ఎకరాల భూమి మీద కన్ను పడుతుంది. ఈ టైం లో నారప్ప కొడుకు ముని కన్నకు పండు సామి కొడుక్కి ఓ గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దదై పేరు పలుకుబడి ఉన్న పండు సామి చెప్పిన మాట విని పోలీసులు ముని కన్నని అరెస్ట్ చేస్తారు. కొడుకుని విడిపించడానికి నారప్ప పండు సామి వేసిన శిక్ష అనుభవిస్తాడు. ఈ క్రమంలో ముని కన్న తండ్రికి జరిగిన అవమానం తెలుసుకుని ఎవరు లేకుండా చూసి పండు సామిని చెప్పుతో కొడతాడు. ఆ అవమానం భరించలేని పండు సామి ముని కన్నని చంపేయిస్తాడు. కొడుకుని పోగొట్టుకున్నా కూడా నారప్ప పండు సామిని ఏమి చేయలేడు. అయినా అన్న చావుకి కారణమైన పండు సామిని చంపేస్తాడు నారప్ప చిన్న కొడుకు సిన్నబ్బ. పండు సామి మరణంతో నారప్ప ఫ్యామిలీ మీద అతని ఫ్యామిలీ పగ పెంచుకుంటుంది. వారిని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో నారప్ప గతం గురించి చిన్న కొడుక్కి తెలియడం. తన ఫ్యామిలీని కాపాడుకోడానికి నారప్పమళ్లీ కత్తి పట్టడం జరుగుతుంది. నారప్ప గతం ఏంటి..? నారప్ప పండు సామి కుటుంబ గొడవ ఎలా ముగిసింది..? కులాల మధ్య గొడవ ఎక్కడిదాకా వెళ్లింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ :

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశారు. అసురన్ చూసిన వారికి నారప్ప జిరాక్స్ కాపీ అనిపించే అవకాశం ఉంటుంది. అయితే నారప్పలో వెంకటేష్ నటన హైలెట్ గా నిలిచింది. డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీమేక్ ను అలానే దించేశాడు. తన మార్క్ టేకింగ్ కాని.. కథ తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చడం లాంటివి చేయలేదు.

అసురన్ ను సీన్ టూ సీన్ దించేశారు. జస్ట్ నటీనటుల మార్పు అంతే తప్ప సినిమా మొత్తం సేం అని చెప్పొచ్చు. ఈ ఒక్క విషయమే తప్ప సినిమాకు వారు పెట్టిన ఎఫర్ట్ తెర మీద కనిపిస్తుంది. సినిమా వయిలెన్స్, ఎమోషనల్ డ్రామగా నడుస్తుంది. కులాల అంతరాల మధ్య కథను దర్శకుడు బాగా చూపించాడు. 

నటన, సాంకేతిక వర్గం :

రీమేక్ స్పెషలిస్ట్ గా వెంకటేష్ ను ఎందుకంటారు అన్న దానికి మరోసారి నారప్ప ద్వారా ఆన్సర్ చెప్పాడు విక్టరీ వెంకటేష్. నారప్ప పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. అసురన్ తో పోల్చకుండా చూసిన వారికి నారప్పగా వెంకటేష్ నటన సూపర్ అనిపిస్తుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకీ తన మార్క్ చూపించారు. కెరియర్ నారప్ప పాత్ర స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రియమణి కూడా తన పాత్రతో అలరించింది. చాలాకాలం తర్వాత ఆమెకు మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. సినిమాలో బసవయ్య పాత్రలో రాజీవ్ కనకాల నటన ఆకట్టుకుంది. ముని కన్నగా చేసిన కార్తీక్ రత్నం ఉన్న కొద్దిసేపు ఆకట్టుకున్నాడు. రావు రమేష్ లాయర్ ఆ యాస్ యూజువల్ గా బాగా చేశారు. నాజర్ తో పాటు మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక నారప్ప టెక్నికల్ టీం విషయానికి వస్తే కెమెరా మెన్ వర్క్ బాగుంది. మణిశర్మ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బీజీఎం ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ బాగుంది. సోల్ మిస్ అవకుండా ఓ సూపర్ హిట్ సినిమాను అలానే తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఒక్కమాటలో : 

నారప్ప మంచి ఎమోషనల్ మాస్ మూవీ..!

రేటింగ్ : 3/5


Related Post