శ్రీకారం : రివ్యూ

March 11, 2021
img

యువ హీరో శర్వానంద్, కిశోర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీకారం. రైతు కొడుకు రైతుగా ఎందుకు మారట్లేదు అన్న ఇంట్రెస్టింగ్ కథాంశంతో శ్రీకారం సినిమా తెరకెక్కింది. శివరాత్రి సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన కార్తిక్ ( శర్వానంద్ ) ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి కేశవులు (రావు రమేష్) వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చుకుంటూ వస్తుంటాడు. చేస్తున్న ఆఫీస్ లో చైత్ర ( ప్రియాంకా అరుల్ మోహన్ ) మనసు గెలుస్తాడు కార్తిక్. ఇక ఈలోగా అతనికి యూఎస్ బ్రాంచ్ కు మేనేజర్ గా ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ కాదనేసి కార్తిక్ ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. సాఫ్ట్ వేర్ కొడుకు వ్యవసాయం చేస్తానంటే తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు..? కార్తిక్ వ్యవసాయం చేయాలని ఎందుకు అనుకున్నాడు..? అతనికి ఎదురైన సమస్యలు ఏంటి అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

తను తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ నే సినిమాగా తెరకెక్కించాలనుకున్న కిశోర్ ప్రయత్నం చాలా గొప్పదని చెప్పొచ్చు. వ్యవసాయం వదిలేసి పట్నాలకు వచ్చి కూలీలుగా మారుతున్న రైతులను చూసి హీరో పాత్ర తను చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తాడు. రైతులను చైతన్య పరచే కొత్త సాగుని చూపిస్తాడు. అతను చెప్పింది నమ్మకం కుదరని రైతులు.. వెనక్కి తగ్గితే.. వారికి జీతాలు ఇచ్చి వ్యవసాయం చేయిస్తాడు.. అంతేకాదు ఉమ్మడి వ్యవహాసం కాన్సెప్ట్ ని కూడా అమలు చేయిస్తాడు. 

కథగా రైతు సమస్యలతో పాటుగా తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా శ్రీకారం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు అనుకున్న విధంగా తెరకెక్కించాడు. 

నటన, సాంకేతికవర్గం :

శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే అందులో తప్పకుండా విషయం ఉంటుందని ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. శ్రీకారం సినిమాతో అది మరోసారి ప్రూవ్ అవుతుంది. కార్తిక్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయిన తీరు చాలా బాగుంటుంది. ఇక ప్రియాంకా అరుల్ మోహన్ కూడా ఇంప్రెస్ చేసింది. రావు రమేష్ మరోసారి అద్భుతమైన పాత్రలో మెప్పించారు. సాయి కుమార్ విలనిజం బాగుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మిక్కి జే మేయర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కిశోర్ కథ అనుకున్న విధంగా తెరకెక్కించాడు. కథనం అక్కడక్కడ స్లో అయినట్టు అనిపుస్తుంది. 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

శ్రీకారం.. మెప్పించే ప్రయత్నం..!

రేటింగ్ : 2.75/5


Related Post